News September 25, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి క్రేజీ అప్డేట్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ‘రా మచ్చా.. మచ్చా’ అంటూ సాగే రెండో సాంగ్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘జరగండి.. జరగండి’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Similar News
News November 18, 2025
గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్‌గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.
News November 18, 2025
రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్లైన్లో <
News November 18, 2025
ఆంక్షలున్నా US వైపే మన విద్యార్థుల చూపు

ఆంక్షలున్నప్పటికీ భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులకోసం అమెరికా వైపే చూస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో USలో 11,77,766 మంది విదేశీ విద్యార్థులు చేరగా వారిలో 3,63,019 మంది భారతీయులే. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల ఉంది. చైనీయులు 2,65,919 మంది కాగా ముందటేడాదికన్నా 4% తగ్గుదల నమోదైంది. మొత్తం విద్యార్థుల్లో 57% STEM కోర్సులకు ప్రాధాన్యమిస్తుండగా వారిలోనూ ఇండియన్స్‌దే అగ్రభాగం.


