News August 28, 2024

రైల్వే హెడ్‌గా తొలిసారి దళితుడు

image

119 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల రైల్వేకు తొలిసారి ఓ దళితుడు అధిపతిగా ఎంపికయ్యారు. 1986 బ్యాచ్ రైల్వే మెకానికల్ ఇంజినీర్ సతీశ్ కుమార్ రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. సెప్టెంబర్ 1న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పీఎం మోదీ నేతృత్వంలోని నియామకాల క్యాబినెట్ కమిటీ ఆయన ఎంపికను ఆమోదించింది. దేశ రాజకీయాలను దళితులు, కోటా ఉద్యమాలు కుదిపేస్తున్న వేళ సతీశ్‌కు కీలక పదవి రావడం గమనార్హం.

Similar News

News December 1, 2025

రైతు సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతా: ఏలూరు ఎంపీ

image

పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు విషయాలను ఆయన పార్లమెంట్లో ప్రస్తావిస్తారని తెలుస్తుంది. ప్రధానంగా రైతుల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి, అలాగే ఇటీవల ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.

News December 1, 2025

కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News December 1, 2025

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

image

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్‌మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/