News August 12, 2024

చెన్నైకి BRS నేతల బృందం

image

TG: బాల్క సుమన్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం త్వరలోనే చెన్నైకి వెళ్లనుంది. డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ టీమ్ అధ్యయనం చేయనుంది. ఆ పార్టీ విధానాలపై కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుంది. అనంతరం DMK విధానాలను BRS కూడా అమలు చేసి, 2028 ఎన్నికలకు పార్టీని పటిష్ఠంగా చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 19, 2025

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. మరోవైపు రేపు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.

News January 19, 2025

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.

News January 19, 2025

సైఫ్‌పై దాడి.. థానేలో నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడిని ఓ రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లు తెలిపింది. సుమారు 100 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.