News October 12, 2024
అమ్మవారికి తల సమర్పించేందుకు భక్తుడి యత్నం!

దుర్గమ్మకు ఓ భక్తుడు ఏకంగా తలనే సమర్పించాలనుకున్న ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని ‘మా బీజాసన్’ గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్‌తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 9 రోజుల పాటు ఉపవాసం ఉండి తల ఇచ్చేందుకు ఆలయానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.
Similar News
News January 5, 2026
కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 5, 2026
మానస పూజకు నియమాలేంటి?

శివ మానస పూజకు ఏకాగ్రతే ప్రధానమైన నియమం. అంతకుమంచి నియమాలు ఏమీ ఉండవు. పూజ చేసే సమయంలో మనసు ఇతరుల మీదకు మళ్లకుండా చూసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని చేయడం ఉత్తమం. ఒకవేళ వీలుకాకపోతే, పవిత్రమైన భావనతో ఎప్పుడైనా చేయవచ్చు. కోపం, ద్వేషం వంటి వికారాలను వదిలి, ప్రేమతో శివుడిని స్మరించాలి. శరీరమే దేవాలయమని భావించి, లోపల ఉన్న శివుడిని దర్శించుకోవడమే ఇందులోని అసలైన నియమం.
News January 5, 2026
నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు

AP: కేంద్రం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ పథకంపై గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించనుంది. ఇందులో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. మొన్నటి వరకు ఉపాధి హామీ పథకంలో 100రోజుల పనిదినాలకే అవకాశం ఉండగా, ప్రస్తుతం 125 రోజులకు పెంచారు. గ్రామసభలు, అవగాహన కోసం పథకం నిర్వహణ ఖర్చుల నుంచి రూ.2వేల చొప్పున ఖర్చు చేయొచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులిచ్చింది.


