News July 31, 2024
యజమాని కోసం 250KMలు నడిచొచ్చిన కుక్క

కర్ణాటకలోని బెలగావిలో అద్భుతం జరిగింది. మహారాష్ట్రలోని పండర్పూర్కు పాదయాత్రగా వెళ్లిన తన యజమానిని అనుసరిస్తూ పెంపుడు కుక్క కూడా వెళ్లింది. అయితే యాత్రలో ఆ కుక్క తప్పిపోయింది. ఎంత వెతికినా దొరక్కపోవడంతో అతడు ఇంటికి వెళ్లాడు. బాధపడుతూ ఉండగా 15రోజుల తర్వాత ఇంటి ముందుకొచ్చి నిల్చుంది. దేవుడి కృపతోనే కుక్క 250km నడిచి ఇంటికి తిరిగి వచ్చిందని గ్రామస్థులు సన్మానం చేసి, ఊరేగించి, భోజనాలు పెట్టారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>