News April 11, 2025

డజను కోడిగుడ్లు రూ.536!

image

అమెరికాలో కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. తాజాగా డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.536 (6.23 డాలర్లు)కు చేరింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశంలో 3 కోట్ల కోళ్లను నిర్మూలించడం, దిగుమతులూ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బర్డ్ ఫ్లూ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 27, 2026

భద్రాద్రి రాములోరి కళ్యాణం తిలకిస్తున్న CM దంపతులు

image

భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణి గీతారెడ్డితోపాటు కూతురు నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి, మంత్రులతో కలిసి తిలకిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

News March 27, 2026

ఈ తగ్గింపు ఎన్నికల వరకేనా: రాజ్‌దీప్

image

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్నికల(మే 4) వరకేనా లేక కొనసాగుతుందా? అని జర్నలిస్ట్ రాజ్‌దీప్ ప్రశ్నించారు. గతంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు చేకూర్చలేదని విమర్శించారు. ఇంధన ధరలు మార్కెట్ పరిస్థితుల కంటే ఎన్నికలపై ఆధారపడ్డాయని ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

News March 27, 2026

RCBvsSRH.. ప్లేయింగ్-11 అంచనా ఇదే!

image

క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. రేపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో RCB, SRH తలపడనున్నాయి. ఇరు జట్ల ప్లేయింగ్-11 అంచనా ఇలా ఉంది.
RCB: కోహ్లీ, సాల్ట్, వెంకటేశ్, రజత్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్, జాకోబ్, మంగేశ్
SRH: అభిషేక్, హెడ్, కిషన్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్, అనికేత్, బ్రైడన్, హర్షల్, శివ్‌నాగ్, జీషన్