News April 10, 2025
మూడు దశాబ్దాల కల సాకారం కానుంది: మంత్రి లోకేశ్

AP: మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం కానుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. చినకాకాని వద్ద వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఈ నెల 13న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్గా, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
ములుగు: హీటెక్కిన “పంచాయితీ” సమరం

జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న ఏటూరు నాగారం, తాడువాయి, గోవిందరావుపేట మండలాల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. మంత్రి సీతక్క సైతం ప్రచారంలో పాల్గొనడం, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో వాతావరణం హీటెక్కింది.
News December 8, 2025
పెరిగిపోతున్న సోషల్ మీడియా ముప్పు

చర్మ సౌందర్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి చాలామంది మహిళలు సమస్యల్లో పడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 20- 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కనిపించే “మిరాకిల్ ట్రీట్మెంట్”ల నమ్మకంతో నకిలీ స్కిన్ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడ అనుభవం లేనివారితో ట్రీట్మెంట్లు చేయించుకొని చర్మానికి నష్టం కలిగించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
News December 8, 2025
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాం: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని CM చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్న తమ మాటలను నమ్మి ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. 18 నెలలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ప్రెస్మీట్లో చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచగలిగామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.


