News September 27, 2024
థియేటర్లో ‘దేవర’ చూస్తూ అభిమాని మృతి

AP: జూ.ఎన్టీఆర్ ‘దేవర’ విడుదల సందర్భంగా కడపలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక అప్సర థియేటర్లో సినిమా చూస్తూ మస్తాన్ వలీ అనే అభిమాని కుప్పకూలాడు. వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతికి గుండెపోటే కారణమని భావిస్తున్నారు. మృతుడిది సీకే దిన్నె మండలం జమాల్పల్లిగా గుర్తించారు.
Similar News
News December 21, 2025
డ్రాగన్ ముప్పుకు ‘ద్వీప’ కవచం: అమెరికా మాస్టర్ ప్లాన్!

A2/AD వ్యూహంతో అమెరికా నౌకలకు చైనా సవాల్ విసురుతున్న వేళ పెంటగాన్ తన పాత EABO వ్యూహానికి పదును పెడుతోంది. భారీ నౌకలపై ఆధారపడకుండా పసిఫిక్ ద్వీపాల్లోని WW-II నాటి ఎయిర్ఫీల్డ్స్ను పునరుద్ధరిస్తోంది. తద్వారా విస్తారమైన ప్రాంతంలో క్షిపణులను మోహరిస్తూ, తైవాన్ రక్షణే లక్ష్యంగా చైనా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సిద్ధం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారనుంది.
News December 21, 2025
ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల సాగు

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.
News December 21, 2025
జగన్కు కేసీఆర్ బర్త్డే విషెస్

తెలంగాణ భవన్లో జరుగుతున్న పార్టీ సమావేశంలో YCP చీఫ్ జగన్కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క పాలసీ తీసుకురాలేదని, తీసుకువచ్చిన ఒకే పాలసీ రియల్ ఎస్టేట్ కోసమేనని ఫైరయ్యారు. తాను CMగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని రూ.2L నుంచి రూ.5L పెంచితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.


