News June 27, 2024

పెళ్లి కూతుర్ని వెతికిపెట్టాలని రైతు దరఖాస్తు

image

కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో యువ రైతు సంగప్ప తనకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేయగా సంగప్ప అందులో దరఖాస్తు చేశారు. ‘నేను 10ఏళ్లుగా అమ్మాయి కోసం చూస్తున్నా. నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మానసిక క్షోభ అనుభవిస్తున్నా’ అని ఆ రైతు వేడుకున్నారు.

Similar News

News January 6, 2026

మేడారం జాతర: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

image

TG: మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ ఆఫీసర్లను సెక్టోరల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా ఈ నెల 24న ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్ చేసి, ఫిబ్రవరి 2 వరకు విధుల్లో ఉండాలి.

News January 6, 2026

తగ్గనున్న చమురు ధరలు.. సామాన్యుడికి భారీ ఊరట!

image

ముడిచమురు ధరలు తగ్గుతాయని, ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చే అవకాశం ఉందని SBI రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. 2026 జూన్ నాటికి బ్యారెల్ ధర $50కు పడిపోవచ్చని తెలిపింది. దీనివల్ల ఇంధన ధరలు తగ్గి FY27లో ద్రవ్యోల్బణం 3.4% కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇదే జరిగితే GDP వృద్ధి కూడా పెరుగుతుంది. రూపాయి బలపడి ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ఠం అయ్యే అవకాశం ఉంది.

News January 6, 2026

నేను పార్టీ లైన్ దాటలేదు: శశి థరూర్

image

తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటలేదని MP శశి థరూర్ స్పష్టం చేశారు. అద్వానీకి విషెస్ చెప్పడం మన సంస్కృతి అని, మోదీని తాను ఎక్కడా పొగడలేదని వివరించారు. 17ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, విభేదాలకు తావులేదని చెప్పారు. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యాక్టివ్‌గా ఉండి UDFను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. BJPకి ఆయన దగ్గరవుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ క్లారిటీ ఇచ్చారు.