News July 30, 2024
ఒలింపిక్స్‌లో అదరగొట్టిన రైతు బిడ్డ
పారిస్ ఒలింపిక్స్‌లో మనూ భాకర్‌తో కలిసి కాంస్యం గెలిచిన షూటర్ సరబ్‌జోత్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు. 22 ఏళ్ల ఈ హరియాణా అథ్లెట్ 13వ ఏట ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నారు. ఆ తర్వాత షూటింగ్‌పై ఆసక్తి పెరగడంతో దానిపై దృష్టి పెట్టారు. షూటింగ్ ఖరీదైన క్రీడ కావడంతో తొలుత సరబ్ తండ్రి ఇందుకు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ప్రోత్సహించడంతో 2019 వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో సరబ్ గోల్డ్ మెడల్ సాధించారు.
Similar News
News February 1, 2025
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఇలా..
ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr
News February 1, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.
News February 1, 2025
ఎల్లుండి ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి ఎల్లుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ కానుంది. రెండు రోజుల్లో రెబల్ స్టార్ లుక్ రివీల్ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. గతంలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ పాత్రలో అక్షయ్ కుమార్ పోస్టర్ రిలీజైంది. దీంతో ప్రభాస్ పాత్రతో పాటు లుక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.