News July 13, 2024
ఫ్యాన్స్‌కు పండగే.. నేడు భారత్VSపాకిస్థాన్ ఫైనల్

లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. నిన్న రెండు సెమీఫైనల్స్ జరగ్గా ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్, మరో మ్యాచులో వెస్టిండీస్‌పై పాకిస్థాన్ గెలిచాయి. ఈ రోజు రాత్రి.9గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్1 హిందీలో చూడవచ్చు.
> All The Best India Champions
Similar News
News November 18, 2025
బస్సుకు మంటలు.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్

AP: నెల్లూరు జిల్లా సంగం హైవేపై పెను ప్రమాదం తప్పింది. 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద మంటలు చెలరేగాయి. అదే రోడ్డుపై వెళ్తున్న సంగం కానిస్టేబుల్ నాగార్జున వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన కానిస్టేబుల్‌ను అభినందించారు.
News November 18, 2025
సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే?

మిగతా గృహ నిర్మాణం అంతా వాస్తు ప్రకారం ఉంటే సింహద్వారం ప్రభావం కొద్దిగా తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉంటూ సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోయినా పెద్దగా దోషం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘వ్యక్తిగత పేరు, జన్మరాశి ఆధారంగా సింహద్వారం ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. వాస్తుపరమైన ఇతర సానుకూలతలు ఈ లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>
News November 18, 2025
డేటా క్లియర్ చేసి.. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ దాచిన రవి!

TG: అరెస్ట్ సమయంలో గంటన్నరపాటు ఐ-బొమ్మ రవి ఇంటి తలుపులు తెరవలేదని పోలీసులు తెలిపారు. తాము వచ్చింది చూసి టెలిగ్రామ్, మొబైల్ డేటాను క్లియర్ చేశాడని చెప్పారు. ల్యాప్‌టాప్‌ను బాత్రూమ్ రూఫ్ కింద, సెల్‌ఫోన్‌ను అల్మారాలో దాచినట్లు వివరించారు. అటు పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. స్నేహితులు, బంధువులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నాడు.


