News October 13, 2024

2025లో మెగా అభిమానులకు పండుగే పండుగ!

image

2025 మెగా అభిమానులకు కనుల పండుగ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సినిమాలు నెలల వ్యవధిలో రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. జనవరి 10న చెర్రీ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, చిరు విశ్వంభర కూడా ఏప్రిల్‌లో రిలీజయ్యే ఛాన్సుంది.

Similar News

News November 18, 2025

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

image

AP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్‌లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

తిరుమల అప్డేట్స్

image

* టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 71,208 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు లభించింది.
* టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఇవాళ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. పది రోజుల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.