News August 21, 2024
‘బలగం’ దర్శకుడితో సినిమా.. నాని ఏమన్నారంటే?

తనకు సినిమా అంటే ఇష్టమని హీరో నాని అన్నారు. ప్రత్యేకించి జానర్ ఏమీ లేకుండా నెరేషన్‌ను ఎంజాయ్ చేస్తానని తెలిపారు. ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘బలగం’ వేణు లాంటి దర్శకులతో వర్క్ చేయాలని ఉందని, త్వరలోనే తమ కాంబోలో చిత్రం ఉంటుందని తెలిపారు. అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పలేనన్నారు. ప్రభాస్‌పై విమర్శలు చేసిన బాలీవుడ్ నటుడికి ఇప్పుడే బిగ్గెస్ట్ పబ్లిసిటీ జరిగి ఉంటుందన్నారు.
Similar News
News February 19, 2026
వరుణ్.. నువ్వో వరం!

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్‌లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
News February 19, 2026
భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.