News April 25, 2024
విజయ్‌తో సినిమా ఇప్పట్లో కష్టమే: వెట్రిమారన్

తమిళ స్టార్ హీరో విజయ్‌తో సినిమా ఇప్పట్లో కష్టమేనని దర్శకుడు వెట్రిమారన్ అన్నారు. ఓ అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చాలా రోజుల క్రితం విజయ్‌కి ఓ కథ చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవచ్చని చెప్పారు. ప్రస్తుతం వెట్రిమారన్ ‘విడుతలై పార్ట్-1’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రంలో నటిస్తున్నారు.
Similar News
News November 11, 2025
మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.
News November 11, 2025
రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ

కేంద్ర క్యాబినెట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్‌పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
News November 11, 2025
దేశంలో భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్: అదానీ

దేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(BESS)ను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. గుజరాత్‌లోని ఖవ్డాలో నెలకొల్పుతున్న ఇది 2026 మార్చికి పూర్తవుతుందన్నారు. 1126 MW సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతుంది. 3 గంటలపాటు ఏకధాటిగా అంతే స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తుంది. 700 బ్యాటరీ కంటైనర్లను దీనిలో వినియోగిస్తారు. ఇది గ్రిడ్‌ను 24 గంటల పాటు స్థిరంగా ఉండేలా చూస్తుంది.


