News November 5, 2024

రాంగ్ రూట్‌లో వెళ్తే రూ.2,000 ఫైన్

image

హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ పకడ్బందీగా అమలులోకి వచ్చాయి. రూల్స్ బ్రేక్ చేస్తే మునుపటిలా చూసీచూడనట్లు వదిలేయడం ఇక ఉండదు. హెల్మెట్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే రూ.200 ఫైన్ వేస్తారు. రాంగ్ రూట్‌లో నడిపితే రూ.2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌పై సస్పెన్షన్ కూడా విధిస్తారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News November 5, 2024

జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు: సీఎం

image

AP: పోలవరం ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రతిరోజూ కీలకమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ముఖ్యమని తెలిపారు. 2028 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తిచేసేలా ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు.

News November 5, 2024

కులగణనను 2025 జనగణనలోకి తీసుకోవాలి: రేవంత్

image

TG: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ నేతలకు మాట ఇస్తే అది శాసనమని అన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని చెప్పారు. దీనిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

News November 5, 2024

దీపికా-రణ్‌వీర్ కూతురి పేరుపై భిన్న స్పందన

image

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్-దీపికా తమ కూతురికి ‘దువా’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పలువురు సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. దువా అనేది ఇతర మతానికి సంబంధించిన పేరని, హిందూ పేరు పెట్టడానికి మనసు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో పేరు పెట్టడం తల్లిదండ్రుల ఇష్టమని, ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు.