News November 22, 2024
సబ్‌మెరైన్‌ను ఢీకొట్టిన చేపల వేట పడవ
గోవాలో ఓ సబ్‌మెరైన్‌ను చేపల వేట సాగించే పడవ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11 మందిని అధికారులు రక్షించారు. ఈ ఘటన గోవాకు 70 నాటికల్ మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. కాగా సబ్‌మెరైన్‌కు జరిగిన నష్టంపై నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై హై లెవెల్ విచారణ కొనసాగుతోంది. కాగా ఈ జలాంతర్గామి నేవీలో వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తుంది. శబ్దం లేకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత.
Similar News
News November 22, 2024
మరోసారి తల్లి కాబోతున్న హీరోయిన్
హీరోయిన్ సనా ఖాన్ మరోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ముగ్గురం నలుగురం కాబోతున్నాం అని పేర్కొన్నారు. 2005లో ‘యేహై హై సొసైటీ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సనా ఖాన్.. కళ్యాణ్ రామ్ ‘కత్తి’ మూవీతో తెలుగులో అరంగేట్రం చేశారు. తెలుగులో గగనం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించారు. 2020లో ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో పాప జన్మించింది.
News November 22, 2024
ఫిల్ హ్యూస్ జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా కార్యక్రమాలు
క్రికెట్ బాల్ తగిలి ఫిల్ హ్యూస్ కన్నుమూసి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అతడి జ్ఞాపకార్థం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. వచ్చే 3 షెఫీల్డ్ షీల్డ్ మ్యాచుల్లో ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరిస్తారని తెలిపింది. 2014లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న సమయంలో షాన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ ఎడమ చెవి కింద తగిలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబరు 27న కన్నుమూశారు.
News November 22, 2024
మణిపుర్‌కు మరో 10,800 మంది జవాన్లు
మణిపుర్‌కు కేంద్రం మరో 90 కంపెనీల నుంచి 10,800 మంది జవాన్లను పంపనుంది. మే, 2023 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 258 మంది మృతి చెందారు. తాజాగా CRPF, BSF, ITBP, SSB నుంచి అదనపు బలగాల మోహరింపుతో మొత్తం 288 కంపెనీల సిబ్బంది అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. Nov 7న జిరిబమ్‌లో హ్మర్ తెగకు చెందిన మహిళను అనుమానిత మైతేయి మిలిటెంట్లు రేప్ చేసి కాల్చి చంపడంతో తిరిగి ఘర్షణ చెలరేగింది.