News January 9, 2025

డిసెంబర్లో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల వరద

image

DECలో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.41,155CR పెట్టుబడులు వచ్చాయి. NOVతో పోలిస్తే ఇది 14.5% వృద్ధి. వరుసగా 46వ నెలా ఈ ఫండ్స్‌ పాజిటివ్ జోన్లోనే ఉండటం విశేషం. NIFTY, SENSEX నష్టపోతున్నా థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో MoM పద్ధతిన రూ.15,331CR ఇన్‌ఫ్లో వచ్చింది. ఇక 12 NFOల్లో రూ.11,337CR, స్మాల్‌క్యాప్ కేటగిరీలో రూ.4667CR పెట్టుబడులు వచ్చాయి. డెట్ ఫండ్స్‌ నుంచి రూ.1.27L CR వెనక్కి తీసుకున్నారు.

Similar News

News January 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 10, 2025

డైరెక్షన్ చేయడం తప్పుడు నిర్ణయం: క‌ంగ‌న‌

image

పొలిటికల్ డ్రామాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని నటి కంగ‌న పేర్కొన్నారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌డం కూడా స‌రైంది కాద‌ని భావించాన‌ని, సెన్సార్ అవ‌స‌రం లేకుండా OTTలో మంచి డీల్ దక్కేదనుకున్న‌ట్టు చెప్పారు. CBFC స‌ర్టిఫికెట్ నిలిపివేయడంతో భయపడ్డానని, NDA ప్ర‌భుత్వం ఉండ‌డం వ‌ల్ల త‌న చిత్రానికి ఏమీ కాద‌ని భావించానని పేర్కొన్నారు. Jan 17న చిత్రం విడుదల కానుంది.

News January 10, 2025

తిరుపతి ఘటన.. టీటీడీ జేఈవో బదిలీ

image

తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యుల్ని చేస్తూ టీటీడీ జేఈవో గౌతమిని ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆమెను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్ట్ చేయాలంటూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన నేపథ్యంలో ఇవాళ రివ్యూ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఎస్పీ సుబ్బరాయుడు, గౌతమి, సీవీఎస్వో శ్రీధర్‌ను వెంటనే బదిలీ చేయాలని <<15108745>>ఆదేశించిన<<>> విషయం తెలిసిందే.