News November 30, 2024

ఫ్లాప్ హీరో.. కానీ స్టార్ హీరోల కంటే ధనవంతుడు

image

‘రక్తచరిత్ర’ సినిమాలో పరిటాల రవి రోల్‌లో నటించిన వివేక్ ఒబెరాయ్ గుర్తున్నారా? ఆయన ఫ్లాప్ హీరోగా అపకీర్తి సంపాదించుకున్నప్పటికీ మరో రంగంలో చక్రం తిప్పుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి ఎంతో శ్రమించి రూ.1200 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన వివిధ సంస్థలు, ఓ ప్రైవేటు యూనివర్సిటీలోనూ పెట్టుబడులు పెట్టారు. దీంతో ఎంతో మంది స్టార్ నటుల కంటే ధనవంతుడయ్యారు.

Similar News

News March 27, 2026

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై గిల్ ఏమన్నారంటే..

image

IPLలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ వల్ల క్రికెట్‌లో అసలైన నైపుణ్యం దెబ్బతింటోందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ 11 మంది ఆడే ఆట అని, ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను చేర్చడం వల్ల గేమ్ వన్ సైడ్‌గా మారుతుందని పేర్కొన్నారు. భారీ స్కోర్ల కంటే సవాల్‌తో కూడిన వికెట్లపై ఆడే మ్యాచ్‌లే థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. రోహిత్, హార్దిక్, అక్షర్ కూడా ఈ రూల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

News March 27, 2026

45 ఏళ్లకే ₹కోటితో రిటైర్‌మెంట్: ఏం చేయాలి?

image

30 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసి 45 ఏళ్లకు రిటైర్ అవ్వడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నెలకు ₹14,500 ఇన్వెస్ట్ చేస్తూ 15 ఏళ్లలో ₹1 కోటి సంపాదించొచ్చు. ఇందులో ₹5,000 గోల్డ్‌లో, ₹9,500 MFలో పెట్టాలి. ఏటా పెట్టుబడిని 10% పెంచుతూ వెళ్తే కాంపౌండింగ్ పవర్‌తో మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. గోల్డ్ ద్వారా సుమారు ₹20 లక్షలు, MF ద్వారా ₹82 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.

News March 27, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 27)

image

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం