News February 11, 2025
నాలుగు లేన్లుగా కరకట్ట రోడ్డు!

AP: విజయవాడ నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు ప్రస్తుతమున్న కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దాదాపు అలైన్మెంట్ పూర్తి కాగా త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం భూసేకరణ/భూసమీకరణ చేయాలా? అనే దానిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నది వరదలను తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేయనున్నారు.
Similar News
News January 20, 2026
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో 210 పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 20, 2026
కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.
News January 20, 2026
అల్లరి నరేశ్ తాత మృతి

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాత ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. వెంకట్రావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. అల్లరి నరేశ్ తండ్రైన ఈవీవీ 2011లో మరణించిన సంగతి తెలిసిందే. కాగా వెంకట్రావు భౌతికకాయానికి ఇవాళ సాయంత్రం నిడదవోలులోని కోరుమామిడిలో అంత్యక్రియలు జరగనున్నాయి.


