News April 27, 2024
స్తంభించిన టెలిగ్రామ్

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ సేవలు ఇండియాలో స్తంభించాయి. దీంతో యూజర్లు మెసేజ్లు పంపించుకోలేకపోయారు. మరికొందరు లాగిన్ కూడా చేయలేకపోయారు. గడిచిన 24గంటల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. నిన్న రాత్రి 10.30గంటల సమయంలో యాప్ సేవలు నిలిచిపోయినట్లు యూజర్లు ట్వీట్లు చేశారు. నిన్న దాదాపు 2గంటలు స్తంభించిపోగా.. ఈ రోజు మధ్యాహ్నం 1.07 నుంచి సేవలు మరోసారి నిలిచిపోయాయని యూజర్లు అంటున్నారు.
Similar News
News October 30, 2025
చైనా స్పేస్ స్టేషన్కు పాక్ వ్యోమగామి

తమ స్పేస్ స్టేషన్కు పాక్ వ్యోమగామిని తీసుకెళ్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ విషయాన్ని స్టేట్ న్యూస్ ఏజెన్సీ షిన్హువా పేర్కొంది. చైనా స్పేస్ ప్రోగ్రామ్స్లో భాగంగా షార్ట్ టర్మ్ మిషన్స్ కోసం పాక్ ఆస్ట్రోనాట్కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. చైనాకు చెందిన వ్యోమగాములతో పాటే పాక్కు చెందిన ఆస్ట్రోనాట్కు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
News October 30, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు!

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,20,490కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,750 పతనమై రూ. 1,10,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. వేడి చేసిన నీటినే తాగండి

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.


