News April 19, 2024
భారీ ధరకు ‘గేమ్ ఛేంజర్’ నార్త్ రైట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఏఏ ఫిలిమ్స్ అధినేత అనిల్ తడానీ రూ.75 కోట్లకు నార్త్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Similar News
News November 18, 2024
టీడీపీ ఎమ్మెల్యేకు ‘విజనరీ లీడర్’ అవార్డు
AP: పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు బ్రిటన్ పార్లమెంట్ విజనరీ లీడర్ అవార్డును ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లలేకపోయారు. ఆయన స్థానంలో యూకే ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ పురస్కారం అందుకున్నారు. అరుదైన అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు, మంత్రులు ఫోన్ చేసి అభినందించారు.
News November 18, 2024
అక్కడ మార్కులుండవ్.. ఎమోజీలే
పిల్లలకు పరీక్షలు, మార్కులు, గ్రేడ్ల ప్రస్తావనే లేకుండా కేరళ కొచ్చిలోని CBSE స్కూల్స్ వినూత్న విధానాన్ని అమలుచేస్తున్నాయి. KG నుంచి రెండో తరగతి వరకు విద్యార్థుల సోషల్ స్కిల్స్ పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదర్శన ఆధారంగా వారికి క్లాప్స్, స్టార్, ట్రోఫీ లాంటి ఎమోజీలను కేటాయిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సాహం కనిపిస్తోందని, ఒత్తిడి అసలే లేదని టీచర్లు చెబుతున్నారు.
News November 18, 2024
USలో చైనాను బీట్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్
అమెరికాకు 2009 తర్వాత అత్యధికంగా విద్యార్థుల్ని పంపిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. 2023-24లో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయులు US ఉన్నత విద్యాలయాల్లో ఎన్‌రోల్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 23% ఎక్కువ. గ్రాడ్యుయేట్స్ 1,96,567 (19%), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ 97,556 (41%)గా ఉన్నారు. చైనీయులు 4% తగ్గి 2,77,398కి చేరుకున్నారు.