News December 3, 2024
ఆ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. తాజాగా వేదిక వివరాలను మేకర్స్ వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు Curtis Culwell Cente, గార్లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఓ ఇండియన్ సినిమా USAలో ప్రీరిలీజ్ అవ్వడం ఇదే తొలిసారని మేకర్స్ వెల్లడించారు.
Similar News
News March 18, 2026
కామారెడ్డి జిల్లాలో పగలు సెగలు, రాత్రి వాన

గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం భిన్నంగా మారింది. మధ్యాహ్నం ఉక్కపోత, రాత్రి వర్షం, ఉదయం చలి గాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమూర్‌లో అత్యధికంగా 13.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, బిక్కనూరులో 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జుక్కల్, డోంగ్లి, బీర్కూర్ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. ఈ మార్పుల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 18, 2026
గ్రాము బంగారం ₹లక్ష.. రాబర్ట్ కియోసాకి అంచనా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలో భారీ కుదుపు తప్పదని ‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అది జరిగిన ఏడాది వ్యవధిలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయన్నారు. గ్రాము గోల్డ్ ధర దాదాపు ₹లక్ష, గ్రాము వెండి ధర ₹540కి చేరే అవకాశం ఉందన్నారు. బిట్‌కాయిన్ $7,50,000, ఎథీరియం $95,000కు చేరతాయని తెలిపారు. తెలివైన ఇన్వెస్టర్లు దీన్నుంచి భారీగా సంపాదించుకుంటారని పేర్కొన్నారు.
News March 18, 2026
సంచలనం.. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డికి లింక్?

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయన సూచనతో డ్రైవర్ శరత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ వద్ద డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌లపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.


