News January 29, 2025

30ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి: సీఎం హర్షం

image

AP: రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై CM చంద్రబాబు, Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై CM అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత RD పరేడ్‌లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు, హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన, బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి SMలో సైతం పెద్దఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.

Similar News

News October 20, 2025

దీపావళి: ఇవాళ ఏం చేయాలి?

image

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉంటే రాత్రి వేళలో <<18052455>>జాగ్రత్తలు<<>> పాటిస్తూ టపాసులు కాల్చాలి.

News October 20, 2025

దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

image

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్‌లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.

News October 20, 2025

ఇవాళ భారీ వర్షాలు

image

ఇవాళ ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఉ.8.30 గంటలలోపు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.