News March 18, 2024
సోఫా, గాజు ముక్కలు, స్పాంజ్ తింటున్న బాలిక

UKకు చెందిన 3ఏళ్ల బాలిక వింటర్ ఆటిజంతో బాధపడుతూ వింతగా ప్రవర్తిస్తోంది. సోఫా, గాజు ముక్కలు, ప్లాస్టిక్, స్పాంజ్, గోడల ప్లాస్టర్ వంటివి ఆహారంగా తింటోంది. నిద్రించే సమయంలో దుప్పటిని కూడా నమిలేస్తోందని.. ఒకరకంగా చెప్పాలంటే ఇల్లు మొత్తం తినేస్తోందని తల్లి స్టేసీ తెలిపారు. ఎప్పుడూ తినకూడని వస్తువులు తినేందుకు తహతహలాడుతుంటుందని చెప్పారు. బాలికకు 13 నెలల వయసు నుంచి పైకా వ్యాధి ప్రారంభమైందని తెలిపారు.
Similar News
News April 5, 2026
ధురంధర్-2ను వీక్షించిన పాక్ మాజీ ప్రధాని?

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని తెప్పించుకొని వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్టు ఖలీద్ వెల్లడించారు. అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నట్లు తెలిపారు. పాక్‌లో ఈ చిత్రంపై నిషేధం విధించినప్పటికీ తాను తొలి రోజే చూసినట్లు ఖలీద్ గతంలో చెప్పారు. కాగా ధురందర్-2లో నవాజ్ పాత్రను మషూర్ అమ్రోహి పోషించారు. క్యాస్టింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్టవడం విశేషం.
News April 5, 2026
భారీగా తగ్గిన ధరలు.. రూ.100కే 8 కేజీలు

ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల రూ.100కే 8 కేజీల ఉల్లి అమ్ముతున్నారు. అటు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెల కిందటి వరకు క్వింటా రూ.2వేలు ఉండగా ఇప్పుడు రూ.800 నుంచి రూ.1,400 మాత్రమే పలుకుతోంది. మరి మీ ఏరియాలో ఉల్లి రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News April 5, 2026
ట్రంప్ పర్మిషన్ లేకపోతే ఆయిల్ కూడా కొనలేరు: రాహుల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్మిషన్ లేకుండా ఇండియా కనీసం చమురు కూడా కొనలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మోదీ కెరీర్ ఎప్పుడైనా ముగించేస్తానని ట్రంప్ ఓపెన్‌గానే అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీకి సంబంధించిన నిజాలున్నాయి. దీంతో ఇండియా ఇంధన భద్రత, డేటాను ట్రంప్ చేతుల్లో ఆయన పెట్టారు. రాజీపడటం వల్లే ఇదంతా జరిగింది’ అని అస్సాంలోని గోలాఘాట్‌లో అన్నారు.


