News May 24, 2024
డబ్బు కోసం తల్లి లేనప్పుడు బాలికకు పెళ్లి!

UP ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం 8వ తరగతి బాలికకు వివాహం చేయడం ఆలస్యంగా వెలుగుచూసింది. CM సామూహిక్ వివాహ్ యోజన కింద Jan27న పిలిభిట్లో ‘934 వెడ్డింగ్స్’ కార్యక్రమం నిర్వహించారు. అయితే.. అప్పుడు తాను ఊర్లో లేనని, భర్త చనిపోగా అంత్యక్రియల కోసం వచ్చేసరికి విషయం తెలిసిందని బాలిక తల్లి శీతల్ దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తన కుమార్తె వయసు దాచేందుకు సర్టిఫికెట్లను మార్ఫింగ్ చేశారన్నారు.
Similar News
News January 26, 2026
గద్వాల: రాజ్యాంగ విలువలే పోలీస్ శాఖకు మార్గదర్శకం: ఎస్పీ

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్యాంగ విలువలే పోలీస్ శాఖకు మార్గదర్శకమని, క్రమశిక్షణ, నిబద్ధతే పోలీసుల బలమని ఆయన స్పష్టం చేశారు. అమరవీరులకు నివాళులర్పించి, రాజ్యాంగ స్ఫూర్తితో శాంతిభద్రతలను కాపాడాలని పిలుపునిచ్చారు.
News January 26, 2026
యాసిడ్ దాడి నుంచి పద్మశ్రీ వరకూ!

కేంద్రం ప్రకటించిన ‘పద్మశ్రీ’ అవార్డుల జాబితాలో యాసిడ్ దాడి బాధితురాలు ప్రొఫెసర్ మంగళ కపూర్(UP) కూడా ఉన్నారు. 12 ఏళ్లకే యాసిడ్ దాడికి గురై 37 సర్జరీలు చేయించుకున్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. సంగీతాన్నే శ్వాసగా మార్చుకుని PhD సాధించి 3 దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్నారు. గ్వాలియర్ ఘరానా శాస్త్రీయ సంగీతంలో ఆమె చేసిన కృషి అద్వితీయం. గాయాల నుంచి గెలుపు వైపు సాగిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.
News January 26, 2026
పనిమనిషిపై పదేళ్లుగా రేప్.. ధురంధర్ నటుడి అరెస్ట్

బాలీవుడ్ యాక్టర్ నదీమ్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10సం.లుగా రేప్కు పాల్పడ్డారని అతడి ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక, మానసిక వేధింపులకు గురైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదని పేర్కొంది. దీంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. మిమి, వాధ్, మై లడేగా తదితర మూవీల్లో నటించిన అతడు ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా వంటమనిషి అఖ్లాక్గా నటించారు.


