News April 13, 2025

ఏడాది చదువుకు దూరమైన బాలిక నేడు జిల్లా టాపర్

image

AP: కర్నూలు(D) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్‌ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. 2021-22లో టెన్త్‌లో 537 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBVలో చేరింది. ఫస్టియర్‌లో 420, సెకండియర్‌లో 966 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.

Similar News

News April 14, 2025

నేటి నుంచి ‘భూభారతి’

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. CM రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందువల్ల తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది.

News April 14, 2025

నేడు లక్నోతో చెన్నై ఢీ.. ఓడితే CSK ఇంటికే!

image

IPLలో ఇవాళ LSG, CSK తలపడనున్నాయి. ఇప్పటి వరకు వీటి మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా లక్నో మూడింటిలో గెలిచింది. ఓ మ్యాచ్‌లో CSK విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కూతురికి అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఆడిన 6 మ్యాచుల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న CSK ఇవాళ కూడా ఓడితే ఫ్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే.

News April 14, 2025

అంబేడ్కర్ జయంతి వేళ ఆయన గురించి..

image

* అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న MPలోని మోవ్‌లో జన్మించారు.
* విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి ఇండియన్
* స్వాతంత్ర్యం తర్వాత మన దేశానికి తొలి న్యాయ మంత్రి
* రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా సేవలు
* 64 సబ్జెక్టుల్లో మాస్టర్, ఆ తరంలో అత్యంత విద్యావంతులు
* అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కుల కోసం పోరాటాలు
* 1956 DEC 6న ఢిల్లీలో కన్నుమూశారు.

error: Content is protected !!