News February 8, 2025

వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.

Similar News

News February 8, 2025

ఉదయం లేవగానే రీల్స్ చూస్తున్నారా?

image

ఉదయం లేవగానే మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తే కార్టిసాల్ హార్మోన్ పీక్స్‌కి వెళ్లిపోయి రోజంతా స్ట్రెస్‌ ఫీలవుతారని డాక్టర్లు చెబుతున్నారు. దానికి బదులు సూర్యరశ్మి పడే ప్రదేశంలో కాసేపు నిల్చొని డే స్టార్ట్ చేస్తే చికాకు, స్ట్రెస్ దూరమవుతుందని అంటున్నారు. సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి రాగానే టీవీలో గొడవలు పడే న్యూస్ చూసేబదులు పిల్లలు, కుటుంబంతో సరదాగా మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.

News February 8, 2025

English Learning: Antonyms

image

✒ Impious× Pious, Devout
✒ Incompetent× Dexterous, Skilled
✒ Inclination× Indifference, Disinclination
✒ Inevitable× Unlikely, Doubtful
✒ Incongruous× Compatible, harmonious
✒ Ingenuous× Wily, Craftly
✒ Infringe× Comply, Concur
✒ Insipid× Delicious, luscious
✒ Insinuate× Conceal, Camouflage

News February 8, 2025

కొత్త ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!

image

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలిపాయి. ఈ చట్టంలో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!