News April 8, 2024
‘హాయ్ నాన్న’కు పురస్కారాల పంట
శౌర్యవ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హాయ్ నాన్న’. దేశీయంగా వివిధ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్, అంతర్జాతీయంగానూ సత్తా చాటింది. న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’లో ఏకంగా 11 పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం సహా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి తదితర విభాగాల్లో మూవీకి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయంగా ఈ సినిమాను ‘హాయ్ డాడీ’గా రిలీజ్ చేశారు.
Similar News
News January 10, 2025
90 గంటల పని వ్యాఖ్యలు.. షాకింగ్‌గా ఉందన్న దీపిక
వారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ <<15106710>>వ్యాఖ్యలపై<<>> హీరోయిన్ దీపికా పదుకొణే స్పందించారు. ‘సీనియర్ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.
News January 10, 2025
‘స్వలింగ వివాహాల’పై తీర్పు కరెక్టే: సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత నిరాకరిస్తూ తామిచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తీర్పులో ఎలాంటి తప్పు కనిపించనందున జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ వివాహాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని 2023 అక్టోబర్‌లో జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
News January 10, 2025
విడాకుల ప్రచారంపై స్పందించిన చాహల్
భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా వస్తున్న వదంతులపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. ఈమేరకు అభిమానులకు ఇన్‌స్టాలో ఓ లేఖ రాశారు. ‘నాకు ఇస్తున్న మద్దతుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ మద్దతుతోనే ఇంతటివాడ్ని అయ్యాను. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. నా వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని అర్థం చేసుకోగలను. కానీ దయచేసి ఆ విషయంలో సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దు’ అని కోరారు.