News August 7, 2024
మరణాన్ని వాయిదా వేయాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ముఖ్యం బిగిలూ!
అకాల మరణాలు పెరుగుతున్నందున ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం అవశ్యమని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారమైన కూరగాయలు, పండ్లు, గింజలు, తృణధాన్యాలను సేవించాలి. ప్రతి ఒక్కరూ రోజుకు 30 నిమిషాలైనా ఫిజికల్ వర్కౌట్స్ చేయాలి. వయసు & ఎత్తుకు తగ్గట్లు బరువు ఉండేలా చూసుకోవాలి. ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం బెటర్ అని, అలవాటు లేకపోతే ఇంకా బెస్ట్ అని స్టడీలో తేలింది.
Similar News
News January 15, 2025
‘డాకు మహారాజ్’ మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌తో కూడిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి తప్పకుండా చూడాలి అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను చూశారా? COMMENT
News January 15, 2025
ITR దాఖలుకు ఇవాళే చివరి తేదీ
2023-24కు గాను ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇవాళే చివరి తేదీ. లేట్, రివైజ్డ్ రిటర్న్స్‌ను రాత్రి 12 గంటల్లోపు దాఖలు చేయాలి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. నేడు ITR దాఖలు చేయకపోతే లీగల్ నోటీసులు, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
News January 15, 2025
ఆకట్టుకుంటున్న ‘మిరాయ్’ పోస్టర్
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ నుంచి మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. చుట్టూ పురాతన దేవాలయాలు, శిథిల భవనాల మీదుగా హీరో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో మూవీపై ఆసక్తిని పెంచుతోంది. ‘గత సంక్రాంతికి ఎగరడం ప్రారంభించా. మీ ప్రేమతో ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా’ అని తేజ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది రిలీజైన ‘హనుమాన్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.