News April 25, 2024
అప్పుల కుప్పగా ఏపీ: రాజ్‌నాథ్ సింగ్

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ‘జగన్ సర్కార్ అందినకాడికి అప్పులు చేసింది. దాదాపు రూ.13.50 లక్షల కోట్ల అప్పు చేసి.. ఒక్కొక్కరిపై రూ.2 లక్షల భారం మోపింది. ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 4, 2026
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు నాలుగేళ్లు

ఉమ్మడి జిల్లా విభజనతో 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 7 నియోజకవర్గాలతో ఏర్పడిన జిల్లా.. వాడపల్లి, అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలు, దిండి రిసార్ట్స్‌తో పర్యాటక రంగంలో జిల్లా రాణిస్తోంది. నాలుగేళ్లలో పాలన చేరువైనప్పటికీ, మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాల్లో అభివృద్ధి జరగాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మరి మీ కామెంట్..!
News April 4, 2026
పాక్‌లో రూ.80 తగ్గిన లీటర్ పెట్రోల్ ధర

పాకిస్థాన్‌లో ఆకాశాన్నంటిన పెట్రోల్ రేట్ ఏకంగా 80 PKR(పాకిస్థాన్ రూపీ) తగ్గింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇటీవల లీటర్ <<19554325>>పెట్రోల్<<>> ధర 458 PKR, లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర 520 PKRకు చేరింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. PM షెహబాజ్ షరీఫ్ వెంటనే 80 PKR తగ్గిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాక్‌లో ఇప్పటికే అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
News April 4, 2026
1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20. మరిన్ని వివరాలకు punjabandsind.bank.in చూడండి.


