News October 8, 2024
గుండెలను పిండేసే ఘటన

AP: అన్నమయ్య జిల్లా రాజంపేటలో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో కొడుకు శ్యామ్(5) చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి శిరీష తల్లడిల్లింది. ఆస్పత్రిలో మృతదేహం పక్కనే పడుకుని అతడితో మాట్లాడుతూ ఉండిపోయింది. ‘కన్నయ్యా ఎంతసేపు పడుకుంటావు.. నిద్రలే’ అంటూ కలవరించడం అందరినీ కలిచివేసింది. పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని ఆమె చెప్పడంతో తండ్రి, కుటుంబసభ్యులు విలపించారు.
Similar News
News March 30, 2026
AIFF చీఫ్ వేధించారు: మాజీ సీఎం కూతురు

ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) చీఫ్ కళ్యాణ్ చౌబే తనను వేధించారని మహిళా అధికారి వాలంకా అలెమావో ఆరోపించారు. మార్చి 29న జరిగిన AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చౌబే, ఇతర అధికారులు హేళన చేసి వేధించారని ఫిర్యాదు చేశారు. ‘నాపై అనవసర, అగౌరవకర వ్యాఖ్యలు చేశారు. నన్ను భయపెట్టేందుకు హద్దులు దాటి మాట్లాడారు’ అని పేర్కొన్నారు. గోవా Ex CM చర్చిల్ అలెమావో కూతురైన వాలంకా AIFF మహిళా కమిటీ చీఫ్‌గా ఉన్నారు.
News March 30, 2026
‘108’ సంఖ్య విశిష్టత గురించి తెలుసా?

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
News March 30, 2026
మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. అందుకే నిపుణుల సూచనలతో సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని వాడితే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.


