News August 2, 2024
భారత్‌కు ‘హార్ట్‌బ్రేకింగ్’ డే

పారిస్ ఒలింపిక్స్‌లో నిన్న భారత్‌కు కష్టంగా గడిచింది. ముఖ్యంగా తెలుగు ప్లేయర్లు దాదాపు రేసు నుంచి నిష్క్రమించారు. బ్యాడ్మింటన్‌లో PV సింధు, సాత్విక్-చిరాగ్, ప్రణయ్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ ఓటమి చవిచూశారు. ఇక షూటింగ్‌లో సిఫ్త్ కౌర్, అంజుమ్ ఎలిమినేట్ అయ్యారు. 20Km నడకలో ప్రియాంక గోస్వామి తదుపరి దశకు చేరుకోలేకపోయారు. అయితే షూటింగ్ విభాగంలోనే స్వప్నిల్ బ్రాంజ్ గెలవడం కాస్త ఊరటనిచ్చింది.
Similar News
News February 4, 2026
భావ వ్యక్తీకరణకు మూలం ‘విశుద్ధ చక్రం’

గొంతు భాగంలో ఉండే ఈ చక్రం భావ వ్యక్తీకరణకు మూలం. ఇది సరిగ్గా ఉన్నప్పుడు మాటలో స్పష్టత, సత్యాన్ని పలికే ధైర్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లభిస్తాయి. అస్థిరంగా ఉంటే గొంతు నొప్పి, థైరాయిడ్ సమస్యలు, ఇతరులతో మాట్లాడటానికి భయం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘హం’ మంత్రాన్ని పఠించాలి. ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేయడం, సంగీతం వినడం, పాటలు పాడటం ద్వారా ఈ చక్రంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు.
News February 4, 2026
ఇలాంటి భారత జట్టును గతంలో ఎప్పుడూ చూడలేదు: ధోని

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భారత జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి భయంకరమైన జట్టును తాను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని జయించ గల జట్టుగా టీమిండియా తయారైందని, ఇదే ఊపు కొనసాగిస్తే కచ్చితంగా భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 4, 2026
మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది

TG: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తంగా 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు SEC తెలిపింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2,996 వార్డులు, డివిజన్లకు ఎలక్షన్ జరగనుంది. దీంతో ప్రతి వార్డుకు సగటున నలుగురు అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 11న పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.


