News July 15, 2024

భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘ఏదైనా ఉచితంగా ఇస్తామని అంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లే. ఉచితాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదు’ అని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 26, 2025

ఇండియాలో భద్రతపై నమ్మకముంది: ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు DECలో జరగాల్సిన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ బాంబు పేలుడే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ PMO దీనిపై స్పందించింది. ‘ఇజ్రాయెల్-ఇండియాతో పాటు ప్రధానులు నెతన్యాహు, మోదీల బంధం చాలా బలమైనది. PM మోదీ నాయకత్వంలోని భారత్‌లో భద్రతపై మా ప్రధానికి పూర్తి నమ్మకముంది. ఇప్పటికే కొత్త డేట్స్ కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని ట్వీట్ చేసింది.

News November 26, 2025

ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

image

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.