News November 22, 2024
ఓ హీరో ఛాన్స్ అడిగాడు, చెప్పుతో కొడతానని చెప్పా: ఖుష్బూ

అప్పట్లో ఓ హీరో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగారని నటి ఖుష్బూ సుందర్ తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకల్లో ఆమె మాట్లాడారు. ‘కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా సెట్స్లో ఉన్నప్పుడు హీరో నా దగ్గరికి వచ్చాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. నా చెప్పు సైజు 41. ఇక్కడే కొట్టాలా.. యూనిట్ అందరి ముందూ కొట్టాలా అని ఎదురుతిరిగా. అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Similar News
News November 2, 2025
లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు కొట్టేశారు

ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ ఇటీవల ముంబైలో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్లో దొంగలు చేతివాటం చూపించారు. రూ.23.85 లక్షల విలువైన 73 ఫోన్లను కొట్టేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం ముంబైలోని MMRDA గ్రౌండులో జరిగిన ఈ కాన్సర్ట్ ఎంట్రీకి మినిమం టికెట్ ధర రూ.7వేలు. 25వేల మందికి పైగా హాజరయ్యారు.
News November 2, 2025
సాగులో వేప వినియోగం – ఫలితాలు అద్భుతం

వ్యవసాయంలో చీడపీడల నివారణలో క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేపనూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్స్, సస్యరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్నిపెంచడం, నులిపురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడపురుగుల నియంత్రణకు వేప పిండి ఉపయోగపడుతోంది.
News November 2, 2025
డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. హార్టికల్చర్, ఎంటమాలజీ, ఎక్స్టెన్షన్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. PhD, BSc(హానర్స్) హార్టికల్చర్ లేదా BVSc, MSc(అగ్రి./MVSc), MSc/MA, BA/BSc ఉత్తీర్ణతతో పాటు నెట్/సెట్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్సైట్: https://drysrhu.ap.gov.in/


