News April 25, 2024
నటుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్

హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లిపీటలెక్కారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2019లో విడుదలైన ‘మనోహరం’ సినిమా అపర్ణకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో దీపక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తాజాగా పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఒక్కటయ్యారు.
Similar News
News March 13, 2026
ఇళ్లు లేనివారికి శుభవార్త

AP: రాష్ట్రంలో అర్హులందరికీ రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో మంజూరైన ఇళ్లు వద్దనుకుంటే రద్దు చేసి, అక్కడే లేదా మరో చోట 3 సెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
News March 13, 2026
యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.
News March 13, 2026
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


