News July 27, 2024
120కి.మీ వేగంతో వెళ్లేలా హైస్పీడ్ హైవే

HYD-బెంగళూరు మధ్య 508KM మేర కొత్తగా హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేను కేంద్రం నిర్మించనుంది. ప్రస్తుత హైవేనే హైస్పీడ్‌కు విస్తరించాలని భావించినా అసాధ్యమని అధికారులు తేల్చారు. కొత్త హైవేను 12 వరుసల్లో నిర్మించాలనే ప్రతిపాదనలు వచ్చినా 6 లేన్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ముందు 4 లేన్లు నిర్మించి, తర్వాత మరో 2 వరుసలకు విస్తరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. DPR తర్వాత కేంద్రం తుది నిర్ణయం ప్రకటించనుంది.
Similar News
News October 19, 2025
Alert: దీపావళికి స్వీట్లు కొంటున్నారా?

TG: దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు కొంటున్న వారికి అలర్ట్. రాష్ట్రంలోని పలు స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్, ఫేక్ సిల్వర్ ఫాయిల్, రీయూజ్డ్ ఆయిల్, కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కనీస పరిశుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో షాపుల్లో క్వాలిటీని చూసి స్వీట్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 19, 2025
రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే: CM

AP: ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, NDA కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
News October 19, 2025
కల్తీ/అసలైన వెండిని ఇలా గుర్తించండి!

*వెండిపై ఉండే హాల్ మార్క్‌ను టెస్టు చేయాలి. 925 ఉంటే వెండిలో 92.5% ప్యూర్ సిల్వర్, 7.5% రాగి ఉన్నట్టు లెక్క. 999 ఉంటే 99.9% ప్యూర్ అని అర్థం.
*వెండి దగ్గర అయస్కాంతం పెడితే అతుక్కోదు. నకిలీ వెండి అతుక్కుంటుంది.
*వెండికి అధిక ఉష్ణ వాహకత (Thermal conductivity)ఉంటుంది. వెండిపై మంచు ముక్క పెడితే త్వరగా కరిగిపోతుంది.
*వెండిని మరో వెండి ముక్కతో కొడితే క్లియర్ సౌండ్ వస్తుంది.