News June 23, 2024

అఫ్గానిస్థాన్‌కు చరిత్రాత్మక విజయం

image

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. టీ20 WCలో ఇవాళ జరిగిన మ్యాచులో గెలిచి చరిత్రాత్మక గెలుపును అందుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 6 సార్లు తలపడగా, ఆసీస్ తొలిసారి ఓడింది. గత టీ20 WCలో ఇంగ్లండ్, పాక్, శ్రీలంకను ఓడించిన AFG, ఈసారి గ్రూప్ స్టేజీలో NZపై, సూపర్-8లో AUSపై గెలుపొందింది. ఆ జట్టు త్వరలోనే టాప్ జట్లలో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Similar News

News October 28, 2025

వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

image

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్‌కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.

News October 28, 2025

నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

image

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.

News October 27, 2025

కవిత కొత్తగా..

image

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.