News October 8, 2025
ఇండస్ట్రీకి ‘హిట్టు’ కళ

గత రెండు, మూడు నెలలుగా సినీ ఇండస్ట్రీ హిట్ సినిమాలతో కళకళలాడుతోంది. బాలీవుడ్ మూవీ ‘సయారా’ నుంచి మొదలుకొని ‘కాంతార ఛాప్టర్-1’ వరకు ఇదే జోరు కొనసాగుతోంది. సైయారా, కొత్త లోక, మిరాయ్, OG సినిమాలు సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రాలకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగానూ రికార్డులు నెలకొల్పాయి. ఇప్పుడు ‘కాంతార ఛాప్టర్-1’ అదే పరంపరను కొనసాగిస్తోంది. మీరు ఏ సినిమా చూశారు?
Similar News
News February 15, 2026
విష ప్రయోగం వల్లే రష్యా ప్రతిపక్ష నేత మృతి: యూరప్ దేశాలు

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో <<12701983>>అనుమానాస్పద రీతి<<>>లో చనిపోవడం తెలిసిందే. విష ప్రయోగం వల్లే ఆయన మృతిచెందినట్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ తాజాగా ఆరోపించాయి. నావల్నీ నుంచి సేకరించి నమూనాల్లో epibatidine అనే విషం ఆనవాళ్లు ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. దక్షిణ అమెరికాలోని ప్రమాదకర కప్పల్లో ఈ విషం ఉంటుందని చెప్పాయి.
News February 15, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2026
గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ దాకా NH-167 విస్తరణ: మోదీ

TG: హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు NH-167ను 4 వరుసలుగా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై PM మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘NH-167 విస్తరణ నిర్ణయం ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఉపాధి అవకాశాలు సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు. 80KM పొడవైన ఈ ప్రాజెక్టుకు ₹3,175 కోట్లు ఖర్చవుతుందని అంచనా.


