News May 21, 2024

‘స్మోకీ పాన్’ తినడంతో కడుపులో రంధ్రం!

image

లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన స్మోకీ పాన్ బెంగళూరులో 12 ఏళ్ల బాలికను ఆస్పత్రిపాలు చేసింది. పాన్ తిన్న తర్వాత తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరగా ఆమె కడుపులో రంధ్రం ఏర్పడినట్లు తేలింది. వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులోని కొంత పేగుని కట్ చేశారు. ఈ స్మోకీ పాన్ ప్రమాదకరమని హెచ్చరించారు. ఐస్ పాన్, ఫైర్ పాన్‌తో పాటు స్మోకీ పాన్‌లు యువతను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇవి ప్రమాదకరమని ఇప్పటికైనా తెలుసుకోండి.

Similar News

News January 15, 2025

నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ విచారణ

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.

News January 15, 2025

వరుసగా 8 హిట్లు ఖాతాలో..

image

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుసగా 8 సినిమాలు సక్సెస్ సాధించిన ఈతరం దర్శకుడు అనిల్ అని సినీ వర్గాలు తెలిపాయి. ఆయన డెబ్యూ మూవీ పటాస్ సూపర్ హిట్‌గా నిలవగా ఆ తర్వాత వచ్చిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి సక్సెస్ అందుకున్నాయి. దీంతో 100% సక్సెస్ రేటును ఆయన కొనసాగిస్తున్నారని పేర్కొన్నాయి.

News January 15, 2025

తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. కొత్తవి ఇస్తామన్న కమిటీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో అందజేసిన పతకాలలో నాణ్యత లేదని అథ్లెట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. షూటర్ మనూ భాకర్ కూడా తన పతకాలు రంగు వెలిశాయని, తుప్పు పట్టాయని తెలిపారు. ఈ మెడల్స్‌ను త్వరలోనే రీప్లేస్ చేస్తామని IOC ప్రకటించింది. ఫ్రాన్స్ కరెన్సీని ముద్రించే ‘ఫ్రెంచ్ స్టేట్ మింట్’ కొత్త పతకాలను తయారుచేస్తుందని పేర్కొంది. కాగా విజేతల కోసం ప్రఖ్యాత ‘ఐఫిల్ టవర్’ ఇనుమును మిక్స్ చేసి 5,084 పతకాలను రూపొందించారు.