News July 14, 2024
భారీగా పెరిగిన కందిపప్పు ధర

TG: రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యులను షాక్ ఇస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో గతనెల రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. సూపర్ మార్కెట్లో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. మినప్పప్పు కేజీ రూ.90-120 ఉండగా ప్రస్తుతం రూ.140-160కి, పెసరపప్పు కేజీ రూ.100 నుంచి రూ.120కి చేరింది. గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తి 40% తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News November 16, 2025
బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా?.. MLAపై నెటిజన్ల ఫైర్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందూ బంధువులకు ధన్యవాదాలు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా. జై హిందుత్వ’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా.. ఓటు వేయకుంటే హిందువులు కాదా? అని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.
News November 16, 2025
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన ఇషా

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ కాంస్యంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో ఇషా 30 పాయింట్లు సాధించి 3వస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో 587 పాయింట్లు సాధించి అయిదో స్థానంతో ఫైనల్కు వచ్చిన ఇషా తుదిపోరులో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఛాంపియన్షిప్లో ఇషాకు ఇదే తొలివ్యక్తిగత పతకం. ఈ ఏడాది ప్రపంచకప్ స్టేజ్ టోర్నీలో ఆమె స్వర్ణం, రజతం సాధించింది.
News November 16, 2025
పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు?

TG: పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, బిల్లులు పెండింగ్లో ఉండటంతో పార్టీపరంగానే వెళ్లే అవకాశం ఉంది. దీనిపై రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు.


