News June 4, 2024
ఉత్తరాంధ్రలో కూటమి MP అభ్యర్థులకు భారీ మెజార్టీ

ఉత్తరాంధ్ర ఎంపీ స్థానాలకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. శ్రీకాకుళం TDP MP అభ్యర్థి రామ్మోహన్నాయుడు (1,67,034), విజయనగరం TDP అభ్యర్థి అప్పలనాయుడు 77,947, విశాఖపట్నం TDP అభ్యర్థి భరత్ 1,49,553.. అనకాపల్లి BJP MP అభ్యర్థి C.M.రమేష్ 96,323 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అరకులో మాత్రం YCP అభ్యర్థి తనూజా రాణి 28,922 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Similar News
News December 9, 2025
7వేల రిజిస్ట్రేషన్లే పెండింగ్: మంత్రి నారాయణ

AP: రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. 66K ప్లాట్లలో 7K మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని, రైతులు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను ఆయన ఇవాళ పరిశీలించారు.
News December 9, 2025
పోస్టర్ రగడ.. ‘కుంభ’గా రేవంత్ రెడ్డి

TG: ‘వారణాసి’ సినిమాలోని విలన్(కుంభ) పాత్రలో CM రేవంత్ ఉన్నట్లుగా పోస్టర్ క్రియేట్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిని తాజాగా BJP షేర్ చేయడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. భారతదేశంలో ఎమర్జెన్సీ మైండ్సెట్ ఇంకా సజీవంగానే ఉందని మండిపడింది. రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తోందని, అవినీతి పాలన కొనసాగిస్తోందని X వేదికగా బీజేపీ విమర్శలు గుప్పించింది.
News December 9, 2025
‘ఇండిగో’ సంస్థకు షాక్ ఇచ్చిన కేంద్రం

దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, ఆలస్యంపై విమానయాన సంస్థ ఇండిగోకు కేంద్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇండిగోకు ఉన్న స్లాట్లలో 5% కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రోజూ నడిచే సర్వీసులు కనీసం 110 వరకు తగ్గే అవకాశముంది. తగ్గించిన స్లాట్లు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్జెట్ వంటి సంస్థలకు కేటాయించనున్నారు. ప్రయాణికుల అసౌకర్యం తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమని DGCA పేర్కొంది.


