News March 24, 2025
అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.
Similar News
News October 23, 2025
ఇండియన్ ఆర్మీకి ‘భైరవ్’

భారత సైన్యానికి మరింత బలం చేకూరనుంది. అత్యాధునిక టెక్నాలజీ, శక్తిమంతమైన ఆయుధాలతో స్పందిస్తూ రిస్కీ ఆపరేషన్లు చేసే ‘భైరవ్’ బెటాలియన్ సిద్ధమైతున్నట్లు ఆర్మీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ తెలిపారు. నవంబర్ 1న తొలి బెటాలియన్ సైన్యంలో చేరనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో 25 బెటాలియన్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ భైరవ్ యూనిట్లో 250 మంది సైనికులు, 7-8 మంది అధికారులు ఉంటారు.
News October 23, 2025
కార్తీక మాసం: ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

ఉల్లి, వెల్లుల్లి రజో, తమో గుణాల ప్రభావాన్ని పెంచుతాయి. రజో గుణం మనస్సులో కోరికలను పెంచుతుంది. తమో గుణం వల్ల బద్ధకం, అజ్ఞానం ఆవరించే అవకాశాలుంటాయి. ఇది దైవ స్మరణ కోసం కేటాయించిన పవిత్ర సమయం. ఈ సమయంలో పూజలు ఏకాగ్రతతో చేయాలంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. అది జరగాలంటే భగవత్ చింతనకు ఆటంకం కలిగించే ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక శుద్ధి కోసం వీటిని తినకుండా ఉండటం ఉత్తమం అని సూచిస్తుంటారు.
News October 23, 2025
మెటాలో 600 ఉద్యోగులపై వేటు!

మెటా కంపెనీ AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు US మీడియా పేర్కొంది. దీంతో ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ప్రభావం పడనుంది. కాగా ఈ తొలగింపుతో అనవసర విధులు తగ్గి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ వాంగ్ తెలిపారు. అయితే కొత్త నియామకాలపై దీని ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది.