News January 2, 2025
‘పుష్ప-2’ నిర్మాతలకు భారీ ఊరట

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ‘పుష్ప-2’ నిర్మాతలు రవిశంకర్, నవీన్కు ఊరట లభించింది. వారిని అరెస్ట్ చేయరాదంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు థియేటర్ వద్ద లాఠీఛార్జ్ ఘటనపై పోలీసులకు NHRC నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 9, 2025
జామపండు తింటే ఎన్నో లాభాలు!

మార్కెట్లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it
News December 9, 2025
ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.
News December 9, 2025
మొదటి విడత ప్రచారానికి తెర

TG: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫలితాలు వెలువడతాయి. మొదటి విడతలో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 56,19,430 మంది ఓటు వేయనున్నారు. వీరి కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


