News August 16, 2024

మాచర్లలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ?

image

AP: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 20 మంది YCP కౌన్సిలర్లు TDPలో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మున్సిపల్ ఛైర్మన్ ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు కూడా TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు స్థానిక MLA బ్రహ్మారెడ్డితో సమావేశమయ్యారు. రేపు వారు TDP కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఎన్నికల్లో మాచర్లలోని అన్ని వార్డులు YCP క్లీన్ స్వీప్ చేసింది.

Similar News

News November 28, 2025

కృష్ణా: జనసేనకు దిక్కెవరు..?

image

కూటమి విజయంపై జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో TDP-YCP నేతలే పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. జనసేన నేతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేదని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు టాక్. జనసేన MP ఉన్నా లేనట్టుగానే పరిస్థితి ఉండటంతో, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ చురుకుదనంపై కేడర్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

image

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 28, 2025

14 ఏళ్లకే ప్రేమ, జంప్.. ఎందుకిలా?

image

విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు(13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ.10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్స్‌కు అప్పగించారు.