News April 21, 2024

RCB ముందు భారీ టార్గెట్

image

కోల్‌కతా 222 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్ సాల్ట్ శుభారంభాన్ని ఇచ్చారు. 14 బంతుల్లోనే 48 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లే తర్వాత చకచకా వికెట్లు పడటంతో కెప్టెన్ అయ్యర్ 50 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. చివర్లో రమణ్‌దీప్ 9 బంతుల్లో 24* రన్స్‌తో రాణించారు. RCB బౌలర్లలో గ్రీన్, యశ్ చెరో రెండు వికెట్లు తీశారు.

Similar News

News February 10, 2026

HYD: కొత్త కమిషనరేట్లు.. వీరే బాధ్యులు..!

image

* కమిషనర్ కర్ణన్ టీంలో అనురాగ్ జయంతి, ప్రియాంక ZCలుగా అందుబాటులో ఉంటారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 7993425555కు కాంటాక్ట్ అవ్వొచ్చు.
* వినయ్ కృష్ణారెడ్డి టీంలో ZCలుగా సాంచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వ్యవహరిస్తారు. మీ ఏరియాలో ఎలాంటి సమస్యలున్నా 9063421145కు కాల్ చేయొచ్చు.
* సృజన టీంలో భోకాడే హేమంత్, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ZCలుగా ఉంటారు. ఎలాంటి సమస్యలున్నా 8008011110కు కాంటాక్ట్ కావచ్చు.

News February 10, 2026

కృతజ్ఞత లేని వారికి మళ్లీ సాయం చేయొద్దు: పరుచూరి

image

ఇతరులు చేసిన మంచిని, సాయాన్ని ఇట్టే మర్చిపోయే రోజులివి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మంచితనంతో చేసిన సాయాన్ని మర్చిపోయే వారికి మరోసారి మేలు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇది అర్హత లేని వారికి దానం చేయడం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. కృతజ్ఞత లేని వారికి పొరపాటున కూడా మళ్లీ సాయం చేసి తప్పు చేయవద్దని ఆయన సూచించారు.

News February 10, 2026

HYD ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

image

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్‌, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.