News October 12, 2024
ఎవరెస్ట్‌పై వందేళ్ల నాటి కాలు

హిమాలయాల్లో వందేళ్ల తర్వాత ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. 1924లో ఇంగ్లండ్‌కు చెందిన ఆండ్రూ కామ్న్ శాండీ ఇర్విన్ (22) మరో వ్యక్తితో కలిసి ఎవరెస్ట్ ఎక్కుతూ గల్లంతయ్యారు. ఎన్ని రోజులు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. గత నెలలో సెంట్రల్ రోంగ్ బుక్ గ్లేసియర్ వద్ద కొందరు ఓ కాలును గుర్తించారు. సాక్సులపై ‘ఏసీ ఇర్విన్’ అని రాసి ఉంది. ఇర్విన్ మునిమనవరాలు డీఎన్ఏతో పోల్చి చూడగా అతడి కాలేనని తేలింది.
Similar News
News January 2, 2026
రేషన్ కార్డు e-KYC పూర్తి చేశారా?

TG: నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల e-KYC ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇంకా చాలా మంది దీనిని పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు e-KYC చేయడం తప్పనిసరి అని తెలిపింది. కొత్త కార్డులు పొందిన వారు సైతం రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది.
News January 2, 2026
NTPCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 2, 2026
చిన్నచిన్న ధర్మాలతో పాపాలెలా పోతాయి?

జనకుడితో వశిష్ఠ మహర్షి ఇలా వివరించారు.. ‘అడవిలో ఎండుగడ్డి వాము ఎంత పెద్దదైనా చిన్న నిప్పు రవ్వ దాన్ని క్షణంలో బూడిద చేస్తుంది. అలాగే యుగయుగాల పాపలు ధర్మాలనే చిన్న పుణ్య కార్యాల ముందు నిలవలేదు. భక్తితో చేసే నదీ స్నానం, దీపారాధన పాపాలను దహించివేస్తాయి. ‘నారాయణ’ అనే నామానికి ఉన్న శక్తి అపారమైనది. ఆ నామ ఉచ్ఛారణతో యమభటులే వణికిపోతారు. భగవంతుని కృపకు ఆడంబరమైన యజ్ఞాల కంటే ధర్మం మిన్న అని గ్రహించు’.


