News July 26, 2024
అమెరికా కాంగ్రెస్‌లో భారత్‌పై కీలక బిల్లు

సెనేటర్ మార్కో రుబియో US కాంగ్రెస్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. డిఫెన్స్, ఇతర టెక్నాలజీ బదిలీలో జపాన్, ఇజ్రాయెల్, కొరియా, నాటో పక్షాలతో సమాన హోదాను భారత్‌కు ఇవ్వడమే దీని ఉద్దేశం. పాక్‌కు నిధులు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో US మిత్ర దేశాల సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్న చైనాను అడ్డుకొనేలా భారత్‌కు మద్దతివ్వడం మరో అంశం. అయితే ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ బిల్లుకు ఆమోదం లభించొచ్చు.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.