News October 8, 2024
వన్డే క్రికెట్లో కీలక మార్పు వచ్చింది ఈరోజే!

1987 వన్డే వరల్డ్ కప్ టోర్నీ సరిగ్గా ఇదేరోజు ఇండియా-పాకిస్థాన్ ఆతిథ్యంలో మొదలైంది. ఇది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 వరకు జరిగింది. అంతకుముందు ఇంగ్లండ్‌లోనే ఈ టోర్నీలు జరిగేవి. అయితే ఈ WC వన్డే క్రికెట్లో కీలక మార్పును తీసుకొచ్చింది. అప్పటివరకు వన్డే మ్యాచులో 60 ఓవర్లు ఉంటుండగా దానిని 50 ఓవర్లకు తగ్గించారు. అప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది. ఇక ఈ WCను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
Similar News
News March 23, 2026
OFFICIAL: సామ్ కరన్ స్థానంలో శనక

IPL-2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనక(రూ.2కోట్లు)ను ఎంపిక చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఆయన శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 3350కి పైగా రన్స్, 86 వికెట్లు సాధించారు.
News March 23, 2026
ఎక్స్పైరీ పేరిట రూ.40 కోట్ల మందులు మాయం!

TG: పేద రోగులకోసం వినియోగించాల్సిన ₹40 కోట్ల విలువైన మెడిసిన్స్ పక్కదారి పట్టినట్లు సమాచారం. హాస్పిటల్స్‌కు పంపిణీ చేసే ప్రధాన కేంద్రం నుంచి ఈ మందులను ఎక్స్పైరీగా చూపి బయటి షాపులకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. క్యాన్సర్ వంటి రోగాలకు వాడే మందులూ ఇలా పక్కదారి పడుతున్నాయని కనుగొంది. విచారణలో స్టోర్ కీపర్ల వాంగ్మూలాలు నమోదు చేసింది. దీనిపై నివేదిక(H&FW/VIG/40CR-MED) రెడీ చేసింది.
News March 23, 2026
IPL: ఆ రికార్డు SRHదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన 287/3 స్కోరు అత్యధికం. హెడ్, క్లాసెన్ వంటి పవర్ హిట్టర్ల విధ్వంసంతో 2025లోనూ SRH 286/6(RR) & 278/3(MI)తో తన సత్తా ఏంటో చూపించింది. అత్యధిక స్కోర్ల జాబితాలో టాప్-5లో నాలుగు SRH పేరిట ఉండటం విశేషం. అలాగే 2024లో DCపై KKR 272/7తో ఐదో పొజిషన్లో ఉంది. ఈ సీజన్లోనైనా SRH 300 రన్స్ కొడుతుందో చూడాలి.


