News October 16, 2024
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

AP: కొత్త MSME పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామిక వేత్త అంశంతో ఈ పాలసీని రూపొందించింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలకు ఆమోదం తెలిపింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది.
Similar News
News December 21, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.260గా ఉంది. విజయవాడలో రూ.250, విశాఖ రూ.260, కామారెడ్డి రూ.250, నంద్యాల రూ.220-250, భీమవరంలో రూ.270గా ఉంది. కిలో మటన్ రూ.800-రూ.1000 వరకు పలుకుతోంది. అటు కోడి గుడ్ల ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో ఒక గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 21, 2025
శ్రీసత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: <
News December 21, 2025
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రకాలు

మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా’ లేదా ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. కిడ్నీల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. ఇది కాస్త సీరియస్ సమస్య అని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ విసర్జనకు వెళ్లాలనిపించడం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


