News April 28, 2024

పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకు అకౌంట్లు లేనివారు, దివ్యాంగులు, రోగులకు మే 5లోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. కాగా ఇంతకుముందు వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 17, 2024

నిరుద్యోగులకు మంత్రి కీలక సూచనలు

image

TG: ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజీ లేదని తెలిపారు. ఆరోగ్య శాఖలో 11 నెలల్లోనే 7వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు. దళారుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News November 17, 2024

రేపు అసెంబ్లీలో కీలక తీర్మానాలు

image

AP అసెంబ్లీలో రేపు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో 8 డివిజనల్, 4 రైల్వే జోనల్ కమిటీలు, యూజర్ కన్సల్టింగ్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను రెండేళ్ల కాలానికి సభ్యులుగా ఎన్నుకునేలా తీర్మానం ప్రవేశపెడతారు.
రేపు అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీటిని ప్రవేశపెట్టనున్నారు. అలాగే బడ్జెట్ సహా పలు అంశాలపై రేపు చర్చలు జరగనున్నాయి.

News November 17, 2024

గొర్రెలు కాస్తున్న స్టార్ హీరో కుమారుడు..!

image

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ స్టార్ డమ్‌ను కాదనుకుని చిన్నాచితక జీవితం గడిపేస్తున్నారు. స్పెయిన్‌లోని ఓ ఫామ్‌లో గొర్రెలు కాస్తున్నారు. యజమాని పెట్టేదే తింటూ అక్కడే నిద్రపోతున్నారు. డబ్బు, హోదా కంటే చిరకాల అనుభవాలకే ఆయన విలువిస్తారు. కాగా ప్రణవ్ ‘పునర్జని’ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాలనటుడి అవార్డు అందుకున్నారు. ‘ఆది’ చిత్రంతో హీరోగా రీఎంట్రీ ఇచ్చారు.